తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఉక్రెయిన్​కు హాలీవుడ్ స్టార్ హీరో రూ.77కోట్లు విరాళం - లియోనార్డో డికాప్రియో వార్తలు

Leonardo DiCaprio News: రష్యా దాడితో భీతుల్లుతున్న ఉక్రెయిన్​కు హాలీవుడ్​ సూపర్​స్టార్ లియోనార్డో డికాప్రియో సాయం అందించారు. 10 మిలియన్​ డాలర్లు(రూ.77కోట్లు) విరాళంగా ఇచ్చారు. డికాప్రియో అమ్మమ్మ ఉక్రెయిన్​లోనే జన్మించారు. అందుకే ఆయన తన వంతు సాయం చేశారు. అయితే ఈ విషయాన్ని ఆయన ఎవరికీ తెలియకుండా గుట్టుగా ఉంచాలనుకున్నట్లు తెలుస్తోంది.

Leonardo DiCaprio donates $10 million to support Ukraine
ఉక్రెయిన్​కు హాలీవుడ్ స్టార్ హీరో రూ.77కోట్ల విరాళం

By

Published : Mar 8, 2022, 4:53 PM IST

Leonardo DiCaprio Ukraine: హాలీవుడ్ సూపర్​స్టార్, టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియో ఉక్రెయిన్​కు తన వంతు సాయం చేశారు. 10 మిలియన్ డాలర్లు (రూ.77కోట్లు) విరాళంగా అందించారు. రష్యా దాడులతో భయానక పరిస్థితిని ఎదుర్కొంటున్న దేశానికి అండగా నిలిచారు. అయితే తాను సాయం చేసిన విషయాన్ని డికాప్రియో గుట్టుగా ఉంచాలనుకున్నట్లు తెలుస్తోంది. ఇంటర్నేషనల్ వైస్​గ్రాడ్ ఫండ్ ఈ విషయాన్ని వెల్లడించింది. అంతర్జాతీయ కార్యక్రమాలకు ఆర్థిక సాయం అందించడమే ఈ గ్రూప్ లక్ష్యం.

డికాప్రియో ఇంత భారీ విరాళం అందించడానికి వ్యక్తిగత కారణమూ ఉంది. ఆయన అమ్మమ్మ హెలెని ఇండెన్​బిర్కెన్​ ఉక్రెయిన్​లోని ఒడెస్సాలోనే జన్మించారు. 1917లో ఆమె తల్లిదండ్రులతో కలిసి జర్మనీకి వలస వెళ్లారు. అక్కడే డికాప్రియో తల్లి జన్మించారు. ఆయనకు అమ్మమ్మతో అత్యంత సాన్నిహిత్యం ఉంది. సినీరంగ ప్రవేశం చేసినప్పటి నుంచి డికాప్రియోకు అమ్మమ్మ మద్దతుగా ఉన్నారు. డికాప్రియో నటించిన ప్రతి సినిమా ప్రీమియర్​కు ఆమె కూతురితో కలిసి వెళ్లారు. 2008లో 93 ఏళ్ల వయసులో హెలెని మరణించారు.

ఉక్రెయిన్​కు హాలీవుడ్ స్టార్ హీరో రూ.77కోట్ల విరాళం

లియోనార్డో డికాప్రియో ఆరు సార్లు ఆస్కార్​కు నామినేట్ అయ్యారు. నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. రివనాంట్ సినిమాలో నటనకు గానూ 2016లో ఆస్కార్ అందుకున్నారు. చాలా ఏళ్లుగా 'యాక్టర్ అండ్ ఎకాలజిస్ట్'​ అనే వ్యాసాన్ని కూడా రచిస్తున్నారు. వాతావరణ విపత్తుపై పోరాటంలో క్రియాశీలకంగా ఉన్నారు. 25 ఏళ్ల వయసులోనే 1998లో కుటుంబ సభ్యులతో కలిసి 'లియోనార్డో డికాప్రియో ఫౌండేషన్​'ను కూడా స్థాపించారు.

ఇదీ చదవండి:Alia Bhatt: ఆలియా హాలీవుడ్​ ఎంట్రీ.. ఈ సినిమాతోనే..

ABOUT THE AUTHOR

...view details