ప్రముఖ సినీ నేపథ్య గాయకులు ఏసుదాసు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో 'లైవ్ లెజెండ్స్' సంగీత విభావరి అలరించింది. ఈ కార్యకమానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఐపీఎస్ అధికారి శిఖా గోయల్, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితో పాటు గాయని సునీత, పలువురు సినీ గాయకులు పాల్గొన్నారు.
అట్టహాసంగా 'లైవ్ లెజెండ్స్' సంగీత విభావరి
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన 'లైవ్ లెజెండ్స్' సంగీత విభావరి అలరించింది. ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఏసుదాసు, చిత్ర తమ పాటలతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు.
లైవ్ లెజెండ్స్
ఏసుదాసు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర.. ఈ ముగ్గురి అపురూప కలయికలో జరిగిన సంగీత సంగ్రామం మార్మోగిపోయింది. ఈ కార్యక్రమంలో ఇతర రాష్ట్రాల నుంచి 20 మంది వాద్యకారులు పాల్గొన్నారు. అభిమానులూ భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ మాట్లాడారు. తనకు పాటలంటే ఎంతో ఇష్టమని.. ఈ ముగ్గురూ సంగీతానికి దేవుడిచ్చిన వరమని అన్నారు.
ఇవీ చూడండి.. అందుకే చైతూ తొలి చిత్రం పూరితో చేయలేదట!