తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఒక్కరోజులో ఎస్పీ ఎన్ని పాటలు పాడారంటే..? - singer spb latest news

'శ్రీశ్రీ మర్యాద రామన్న' చిత్రంతో ప్లేబ్యాక్ ‌సింగర్‌గా తన ప్రస్థానం ప్రారంభించారు.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. తొలి తెలుగుపాట పాడిన 8 రోజుల్లోనే కన్నడలోనూ అవకాశం అందుకున్నారు. తర్వాత తమిళం, మలయాళం క్రమంగా హిందీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన బాలు ఎన్నో మధురమైన పాటలు ఆలపించారు. కోట్లాదిమందిని అలరిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే కొన్ని అరుదైన రికార్డులు కూడా సృష్టించారు.

singer sp balu latest news
ఒకేరోజు ఎస్పీ బాలు ఎన్ని పాటలు పాడారో తెలుసా..?

By

Published : Sep 25, 2020, 2:27 PM IST

ఒకే రోజులో అత్యధిక పాటలు పాడిన గాయకుడిగా తన పేరిట ఓ అరుదైన రికార్డు లిఖించుకున్నారు ఎస్పీ బాలు. 1981లో జరిగింది ఆ సంఘటన. కన్నడ సంగీత దర్శకుడు... ఉపేంద్ర కోసం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పాటల రికార్డింగ్‌లోనే ఉండిపోయారు బాలు. ఆ పన్నెండు గంటల వ్యవధిలో ఏకంగా 21 పాటలు రికార్డ్‌ చేసి చరిత్ర సృష్టించారు.

మళ్లీ..

అలానే తమిళంలో 19 పాటలు ఒకేరోజు, హిందీలో 16 పాటలు ఒకేరోజు పూర్తిచేసి అందర్ని అబ్బురపరిచారు ఎస్పీ బాలు. ఆ క్రమంలోనే పి.సుశీల, ఎస్‌.జానకి, వాణి జయరామ్‌, ఎల్‌.ఆర్‌. ఈశ్వరితో కలసి ఎన్నో.. డ్యూయెట్‌లతో ప్రేక్షకులను అలరించారు. ఎంజీ రామచంద్రన్‌, శివాజీ గణేశన్‌, జెమిని గణేశన్‌ వంటి దిగ్గజ హీరోలకు పాటలు పాడారు. మ్యూజిక్‌ మాస్ట్రో ఇళయరాజతో సినిమాల్లోకి రాక ముందు నుంచే బాలుకు మంచి అనుబంధం ఉండేది.

సూపర్​హిట్​ కాంబో...

ఇళయరాజ, ఎస్పీ బాలు కలసి ఎన్నో ఆల్‌టైమ్ హిట్‌ గీతాలు ప్రేక్షకులకు అందించారు. ఎస్పీ బాలు పాటల గురించి మాట్లాడాల్సి వస్తే.. ఇళయారాజా ప్రస్తావన రాక మానదు. అలాగే ఇళయరాజా సంగీతం గురించి చెప్పాలంటే... బాలు ప్రస్తావన తేకుండా ఉండలేం. వీళ్లిద్దరిదీ ఆ స్థాయిలో లెజెండరీ కాంబినేషన్‌గా నిలిచిపోయింది. ఇద్దరూ కలిసి వివిధ భాషల్లో వందలకొద్దీ పాటలు చేశారు. శ్రోతలను అలరించారు. ఇద్దరికీ ఒకరంటే మరొకరికి మంచి గౌరవం కూడా.

ఘంటశాల టూ దేవీశ్రీ ప్రసాద్​...

సంగీత దర్శకులు విషయానికి వస్తే... ప్రారంభంలో తన గురువు ఎస్పీ కోదండపాణితో మొదలు పెట్టి... కేవి మహదేవన్‌, సాలూరి రాజేశ్వరరావు, సత్యం వంటి దిగ్గజాలు అందరితో కలసి పని చేశారు.. బాలు. ఆలీబాబా 40 దొంగలు చిత్రంతో ఘంటశాలతో పరిచయం అయింది.

టీవీ రాజు చిత్రాలకూ ఎన్నో పాటలు పాడారు బాలు. ఆదినారాయణ, చక్రవర్తి, జేవీ రాఘవుల సంగీత సారథ్యంలో కూడా పని చేశారు. సంగీతదర్శకులు సత్యంకు అనేక హిట్‌ పాటలు పాడారు.

రమేష్‌నాయుడు, జీకే వెంకటేష్, చలపతిరావుల నుంచి రాజ్‌-కోటి వరకు మరెంతో మందితో పని చేశారు బాలు. అంతేకాకుండా ఎం.ఎం. కీరవాణి, బప్పిలహరి, ఆర్డీ బర్మన్‌, ఏఆర్‌ రెహమాన్​, విద్యాసాగర్, వాసురావు, ఎస్వీ కృష్ణారెడ్డి చిత్రాల్లో పాటలకు ప్రాణం పోశారు. అలా పాత- కొత్త తరం వారధిగా ఎం.ఎం. శ్రీలేఖ, సందీప్‌చౌత, మణిశర్మ, వందేమాతరం శ్రీనివాస్‌, రమణ గోగుల, దేవ, ఎస్‌.ఎ. రాజ్‌కుమార్, దేవిశ్రీ ప్రసాద్‌ల బాణీలకు స్వరం అందించారు.

ABOUT THE AUTHOR

...view details