తెలంగాణ

telangana

ETV Bharat / sitara

గాన గంధర్వుడికి పురస్కారాలు దాసోహం - ఎస్పీ బాలు వార్తలు

వేలాది పాటలతో కోట్లాది మనసులో చిరస్మరణీయంగా నిలిచిపోయారు గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. సినీ సంగీత లోకానికి బాలు అందించిన సేవలకు గుర్తింపుగా ఆయన మరణాంతరం కేంద్రప్రభుత్వం పద్మవిభూషణ్​ అవార్డుతో గౌరవించింది. ఆయన సంగీత ప్రస్థానంలో మరెన్నో అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా వాటిని గుర్తు చేసుకుందాం.

balu songs news
గాన గంధర్వుడికి పురస్కారాలు దాసోహం

By

Published : Jan 25, 2021, 10:16 PM IST

ఎస్పీ బాలు అత్యద్భుత ప్రతిభకు తగ్గట్టే.. లెక్కలేనన్ని పురస్కారాలు ఆయన్ని వరించాయి. కేంద్రం తాజాగా ఆయనికి పద్మ విభూషణ్​ అవార్డు అందించిన తరుణంలో బాలు అందుకున్న ఇతర పురస్కారాలను ఓసారి గుర్తుచేసుకుందాం..

పాటలకు ప్రాణం పోసిన బాలు.. సంగీత ప్రయాణంలో 6 జాతీయ పురస్కారాలు గెలిచారు. అలాగే తెలుగునాట ఏకంగా 25నంది అవార్డులతో భళా అనిపించారు. తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాల నుంచీ అనేక పురస్కారాలూ అందుకున్నారు. హిందీ పాటకు గానూ ఓసారి, దక్షిణభారత పాటలకు ఆరు పర్యాయాలు ఫిల్మ్ ఫేర్ సాధించారు. ఇప్పుడు ఆయనను కేంద్రప్రభుత్వం పద్మవిభూషణ్(మరణాంతరం)​ అవార్డుతో గౌరవించింది.

మరెన్నో అవార్డులు

2012 సంవత్సరానికి గాను ఎన్టీఆర్​ జాతీయ పురస్కారం ఎస్పీబీని వరించింది. భారతీయ చిత్ర పరిశ్రమకు అందించిన సేవలకు గుర్తింపుగా... 2016లో సిల్వర్ పీకాక్ మెడల్ వచ్చింది. ఇక భారత ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మశ్రీని 2001లోనూ, పద్మభూషణ్‌ అవార్డును 2011లోనూ అందుకున్నారు.

ఆయన కంఠస్వరంలో రసవాహిని ఉప్పొంగుతోంది.. మాధుర్యం అంబరాన్ని తాకుతుంది. ఆయన సంగీతం ఖండాంతరాల్లో ఉండే భారతీయ సంతతిని సైతం ఉత్తేజింపజేస్తోంది. ఆయనే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. తన మధురమైన గాత్రంతో ఏళ్లుగా అలరిస్తున్న ఆయన.. కెరీర్​లో ఎన్నో ఘనతలు సాధించారు. వాటి గురించి ఓసారి తెలుసుకుందాం.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బాల్యం
బాలు వైవిధ్యం
బాలు గళం
ఎస్పీ బాలులోని నటన
ఎస్పీ బాలు అందుకున్న పురస్కారాలు

ABOUT THE AUTHOR

...view details