కరోనాతో పోరాడుతున్న సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి వెల్లడించింది. వెంటిలేటర్, ఎక్మో సాయంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారని తెలిపింది. ఈ మేరకు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ అనురాధ భాస్కరన్ బులెటిన్ విడుదల చేశారు.
ప్రార్థనలు ఫలిస్తున్నాయ్.. స్పృహలోకి వచ్చిన ఎస్పీ బాలు - singer sp balasubrahmanyam news 2020
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు ఆరోగ్యంపై తాజాగా బులెటిన్ విడుదల చేసింది చెన్నై ఎంజీఎం ఆస్పత్రి. ఐసీయూలో వెంటిలేటర్, ఎక్మో సాయంతో ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఎస్పీ ఆరోగ్యం నిలకడగానే ఉందని స్పష్టం చేసింది.
ప్రార్థనలు ఫలిస్తున్నాయ్.. స్పృహలోకి ఎస్పీ బాలు
బాల సుబ్రహ్మణ్యం స్పృహలోకి వచ్చారని, వైద్యానికి స్పందిస్తున్నారని బులిటెన్‌లో పేర్కొన్నారు. బాలు ఆరోగ్య పరిస్థితిని వైద్యబృందం సునిశితంగా పర్యవేక్షిస్తోందని తెలిపారు.
ఆగస్టు మొదటివారంలో కరోనా బారిన పడటం వల్ల బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. అప్పటినుంచి ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఆయన కోలుకొని క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ ఆయన అభిమానులు, ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు.
Last Updated : Aug 26, 2020, 8:01 PM IST