తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆర్ఆర్ఆర్' సినిమాకు తప్పని లీకుల బెడద! - ntr tiger fight in RRR

చరణ్-తారక్​ల 'ఆర్ఆర్ఆర్' ఫొటోలు మరోసారి లీకయ్యాయి. ఎంత పక్కగా ప్లాన్​ చేసినా సరే ఇలా జరుగుతుండటం చిత్రబృందాన్ని భయపెడుతోంది.

LEAKED photos of Jr NTR, Ram charan from RRR movie
'ఆర్ఆర్ఆర్' సినిమాకు తప్పని లీకుల బెడద!

By

Published : Mar 4, 2021, 10:16 AM IST

స్టార్ డైరెక్టర్ రాజమౌళి తీస్తున్న 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ చివరి దశలో ఉంది. రామ్​చరణ్, జూ.ఎన్టీఆర్​పై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఇతర తారాగణమూ ఇందులో పాల్గొంటున్నారు. అయితే గతంలో జరిగినట్లే, ఇప్పుడు మరోసారి కొన్ని ఫొటోలు లీకయ్యాయి.

ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ ఫైట్​లో చరణ్-తారక్

క్లైమాక్స్ ఫైట్​ సీన్లకు సంబంధించి తారక్, చరణ్​ ఫొటోలు బయటకొచ్చేశాయి. ఇందులో ఎన్టీఆర్​ పులితో పోరాటం చేస్తున్నది ఒకటి, చరణ్ బ్రిటీష్ పోలీస్​ దుస్తుల్లో ఉన్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్​చల్ చేస్తోంది.

ఈ సినిమాలో రామ్​చరణ్.. అల్లూరి సీతారామరాజుగా, జూ.ఎన్టీఆర్.. కొమరం భీమ్​గా నటిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ, రే స్టీవెన్​సన్, అలీసన్ డూడీ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీత దర్శకుడు. డీవీవీ దానయ్య సుమార్ రూ.400 కోట్లతో నిర్మిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబరు 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

రామ్​ చరణ్-జూ.ఎన్టీఆర్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details