నటుడు రానా హీరోగా వెండితెరకు పరిచయమైన సినిమా' లీడర్'(leader movie telugu). రాజకీయ నేపథ్యంలో విడుదలై(2010లో) ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని దర్శకుడు శేఖర్‌కమ్ముల అద్భుతంగా తీర్చిదిద్దారు. అయితే ఈ చిత్రానికి కొనసాగింపు ఉంటుందని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది.
ఇప్పుడీ విషయంపై స్పష్టతనిచ్చారు దర్శకుడు శేఖర్ కమ్ముల(leader movie director). ప్రస్తుతం నాగచైతన్య, సాయిపల్లవి జంటగా ఆయన తెరకెక్కించిన 'లవ్‌స్టోరీ'(love story release date 2021) సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన 'లవ్‌స్టోరీ' తర్వాత తాను తెరకెక్కించబోయే చిత్రాల వివరాలను తెలిపారు. తమిళ హీరో ధనుష్‌తో ఓ థ్రిల్లర్ మూవీని ఇటీవలే ఆయన ప్రకటించారు. దీంతో పాటే రానాతో 'లీడర్ 2' ఉంటుందని స్పష్టం చేశారు. దీనిపై మరోసారి చర్చలు జరపాలని అన్నారు.
రానాతో 'లీడర్' సీక్వెల్.. శేఖర్‌కమ్ముల క్లారిటీ - love story release date 2021
హీరో రానాతో 'లీడర్ 2'(leader movie telugu) సినిమా చేస్తానని స్పష్టతనిచ్చారు దర్శకుడు శేఖర్ కమ్ముల. దీనిపై చర్చలు జరుగుతున్నాయని అన్నారు. ఇటీవల తమిళ హీరో ధనుష్‌తోనూ ఓ సినిమా చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
రానా
ఇదీ చూడండి: వెండి తెరపై 'ఓట్ల' సిత్రాలు