తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకున్నారు మహాకవి విశ్వనాథ సత్యనారాయణ. ఆయన జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా ప్రముఖ హాస్యనటుడు ఎల్బీ శ్రీరామ్ నటిస్తూ నిర్మించిన చిత్రం 'కవిసమ్రాట్'. యువ దర్శకుడు సవిత్ సి.చంద్ర దర్శకత్వం వహించిన ఈ వెబ్ ఫిల్మ్ విడుదలకు సిద్ధమైంది. మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాష ఔన్నత్యానికి విశ్వనాథ సత్యనారాయణ చేసిన కృషిని గుర్తు చేసుకుంది 'కవిసమ్రాట్' చిత్రబృందం.
'కోరిక, సంకల్పం కలగలిపిన చిత్రమే 'కవిసమ్రాట్" - ఎల్బి శ్రీరామ్ లేటెస్ట్ న్యూస్
మహాకవి విశ్వనాథ సత్యనారాయణ జీవితాధారంగా రూపొందిన వెబ్ఫిల్మ్ 'కవిసమ్రాట్'. ప్రముఖ హాస్యనటుడు ఎల్బీ శ్రీరామ్ నటించి.. స్వీయనిర్మాణంలో రూపొందిన చిత్రమిది. మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాషకు కవి సత్యనారాయణ చేసిన కృషిని 'ఈటీవీ'తో చిత్రబృందం పంచుకుంది. ఆ విశేషాలు మీకోసం..
కోరిక, సంకల్పం కలిగలిపిన చిత్రమే 'కవిసమ్రాట్'
నేటి యువతరానికి విశ్వనాథ సత్యనారాయణ గొప్పతనాన్ని వివరించేందుకు 'కవిసమ్రాట్' చిత్రాన్ని రూపొందించినట్లు చిత్రబృందం వెల్లడించింది. ప్రధానపాత్రలో నటించిన ఎల్బీ శ్రీరామ్తోపాటు తమ్ముడి పాత్ర పోషించిన అనంత్, దర్శకుడు సవిత్, సంగీత దర్శకుడు జోస్యభట్ల కవిసమ్రాట్ అనుభవాలను ఈటీవీతో పంచుకున్నారు.
ఇదీ చూడండి..స్టార్ నటీనటుల వారసులే.. బాలనటులుగా!
Last Updated : Aug 29, 2021, 2:19 PM IST