యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా తివిక్రమ్ తెరకెక్కించిన చిత్రం 'అరవింద సమేత'. ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలోని ప్రతి పాత్రకు ప్రేక్షకులు పట్టం కట్టారు. ముఖ్యంగా బసిరెడ్డి (జగపతి బాబు) భార్య పాత్ర కీలకమైంది. ఈశ్వరీరావు ఆ పాత్రలో కనిపించింది. కన్న కొడుకు (నవీన్ చంద్ర)ని కట్టుకున్న భర్త (జగపతిబాబు) కళ్ల ముందే చంపినప్పుడు.. ఆ హృదయవిదారక సన్నివేశంలో జీవించి అందరితో కంటతడి పెట్టించింది. అంతగా ఆ పాత్రలో ఒదిగిపోయింది ఆమె.
అందుకే లయ 'అరవింద సమేత'లో నటించలేదు - junior ntr
నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'అరవింద సమేత'. ఈ సినిమాలో మాజీ హీరోయిన్ లయ నటించాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల తప్పుకుంది.
అయితే ముందుగా ఆ పాత్ర కోసం లయను సంప్రదించాడు త్రివిక్రమ్. అప్పటికే లయ వివాహం చేసుకుని చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంది. మళ్లీ వెండితెరపై కనిపించాలనే కోరిక ఉన్నా.. అమ్మ, వదిన లాంటి పాత్రలు చేసేందుకు ఇష్టపడలేదట. అలాంటి పరిణితి గల పాత్రలకు ఆమెకు కాస్త సమయం పడుతుందని చెప్పిందట. ఈ కారణంగా త్రివిక్రమ్ ఆ పాత్రకు ఈశ్వరీరావును ఎంపిక చేశాడు. "తారక్ నటన నాకు చాలా ఇష్టం. అతడితో నటించే అవకాశం వచ్చినా చేయలేకపోతున్నాను. భవిష్యత్తులో చేస్తాను" అని ఓ ఇంటర్వ్యూలో తన మనసులో మాట పంచుకుంది లయ.
ఇవీ చూడండి.. సినిమా: ఈ ఏడాది.. వైవిధ్యమే విజయరహస్యం..!