ఈ సారి ఈద్ కానుకగా బాలీవుడ్ ప్రేక్షకులకు 'లక్ష్మీబాంబ్'ను కానుకగా అందివ్వబోతున్నాడు అక్షయ్ కుమార్. ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న ఈ చిత్రానికి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నాడు. కియారా అడ్వాణీ కథానాయిక.
దక్షిణాదిలో సూపర్ హిట్‌గా నిలిచిన 'కాంచన'కు హిందీ రీమేక్ ఇది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని రంజాన్ కానుకగా 2020 మే 22న విడుదల చేయనున్నారు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తయిందని, కామెడీ సన్నివేశాలు చాలా బాగా వచ్చాయని చిత్రబృందం చెబుతోంది. తుషార్ కపూర్, షబీనా ఖాన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.