సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి(Lavanya Tripati) తన చర్మ సంరక్షణకు ఇంటి చిట్కాలనే ఉపయోగిస్తుందట. 'సెనగ పిండిలో పెరుగు, చిటికెడు పసుపు, కొన్ని చుక్కల రోజ్‌వాటర్ కలిపి ముఖానికి రాస్తాను. చిన్నప్పటి నుంచీ డ్యాన్స్, స్పోర్ట్స్‌తో ఎప్పుడూ బిజిగా ఉండే నాకు ఇది ట్యాన్‌ను దూరం చేయడంతో పాటు మెరుపునీ ఇచ్చేది. నిమ్మరసంలో బేకింగ్ సోడా కూడా బాగా పనిచేస్తుంది' అని లావణ్య చెప్పుకొచ్చింది.
ఈ సొట్ట బుగ్గల సుందరి.. అందం రహస్యమిదే..!
అందమైన రాక్షసి.. సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi Movies). 'అందాల రాక్షసి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ నటి చర్మ సంరక్షణకు ఇంటి చిట్కాలనే ఉపయోగిస్తుందని చెబుతోంది. మరి ఆ చిట్కాలేంటో ఓసారి చూసేయండి..
వంట చేయడం తనకు ఇష్టమైన వ్యాపకమని చెప్పింది లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi Movies). 'వంట చేసే సమయంలో కోసే టొమాటో, నిమ్మకాయ, దోస వంటి వాటిని ముఖానికి రుద్దేస్తా. వీటి ద్వారా అందే సహజ పోషకాలను ఏ ప్రొడక్ట్ ఇవ్వలేవు. బియ్యప్పిండిలో చిటికెడు దాల్చినచెక్క పొడి, రోజ్‌వాటర్ కలిపి రాస్తా. ముఖానికి నునుపుతోపాటు స్వచ్ఛమైన గులాబీ మెరుపు వస్తుంది. ఓట్‌మీల్, నారింజ తొక్కల పొడి మిశ్రమం స్క్రబ్‌గా ఉపయోగిస్తా' అని చెబుతోంది లావణ్య త్రిపాఠి.
ఇదీ చదవండి:నటనలో మహారాణి.. ఈ వెండితెర శివగామి