'అందాల రాక్షసి'తో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది లావణ్య త్రిపాఠి. తర్వాత పలు చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. తాజాగా గ్లామర్ పాత్రలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
'చచ్చినా అలాంటి పాత్రలు వదులుకోను' - లావణ్య త్రిపాఠి వార్తలు
'అందాల రాక్షసి'తో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది లావణ్య త్రిపాఠి. తర్వాత పలు చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. తాజాగా గ్లామర్ పాత్రలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

"నా దృష్టిలో గ్లామర్ అనేది ప్రధానంగా కళ్లు, హావభావాల ప్రదర్శనలో ఉంటుంది. ధరించే దుస్తుల ద్వారానే గ్లామర్‌గా కనిపిస్తామని అనుకోకూడదు. గ్లామర్‌గా ఉండటం అంటే షార్ట్స్, స్కర్ట్స్, టూ పీస్ డ్రస్సులు వంటి మోడ్రన్ దుస్తుల్లో కనిపించడం కాదు. నా దృష్టిలో ఎక్స్‌పోజింగ్ వేరు, గ్లామర్ వేరు. అలంకరణే గ్లామర్ కాదు. ఏం చేసినా పాత్రల పరిధుల్లోనే చేయాలి. అసలు కొన్ని పాత్రల అల్లికలోనే తెలియని గ్లామర్ ఉంటుంది. ఇలాంటివి దక్కడం చాలా క్లిష్టం. ఎందుకంటే, ఈ తరహా కథలే అరుదు కాబట్టి. నాకు కనుక అలాంటి పాత్ర లభిస్తే చచ్చినా వదులుకోను.