తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మహేష్​- త్రివిక్రమ్‌ మూవీ.. అప్డేట్​ వచ్చేసింది.. - మహేశ్​ బాబు సినిమా అప్డేట్స్​

మహేష్​ బాబు-త్రివిక్రమ్(Mahesh Babu-Trivikram movie) దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి సంబంధించిన అప్డేట్​ను ఇచ్చింది చిత్రబృందం. కథానాయికతో పాటు, సాంకేతిక బృంద వివరాలను వెల్లడించింది.

mahesh
మహేశ్​

By

Published : Aug 9, 2021, 5:00 PM IST

మహేష్​ బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్‌(Mahesh Babu-Trivikram movie) దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. సోమవారం ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను చిత్రబృందం వెల్లడించింది. కథానాయికతో పాటు, సాంకేతిక బృంద వివరాలను ప్రకటించింది. ఈ చిత్రంలో మహేష్​ సరసన బుట్ట బొమ్మ పూజా హెగ్డే సందడి చేయనుంది. ఎ.ఎస్‌.ప్రకాశ్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌గా, నవీన్‌ నూలి ఎడిటర్‌గా, మది సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించనున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తారు. హారిక అండ్​ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు)ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం మహేష్​ పరశురామ్‌ దర్శకత్వంలో 'సర్కారువారి పాట' చిత్రంలో నటిస్తున్నారు. కీర్తి సురేశ్‌ కథానాయిక. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే మహేష్​-త్రివిక్రమ్‌ కాంబో సెట్స్‌పైకి వెళ్లనుంది.

ABOUT THE AUTHOR

...view details