తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అఖిల్-పూజా రొమాన్స్.. 'పెళ్లి సందD' టీజర్​కు టైమ్ ఫిక్స్ - pooja hegde trivikram

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్​లర్, పెళ్లి సందD, ది దిల్లీ ఫైల్స్, రీసౌండ్, గణేశ్ బెల్లంకొండ కొత్త చిత్రాల విశేషాలు ఇందులో ఉన్నాయి.

.
.

By

Published : Sep 13, 2021, 6:42 PM IST

*'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్​లర్'(most eligible bachelor) సినిమాలోని 'లహరాయి' సాంగ్ ప్రోమో వచ్చేసింది. రొమాంటిక్​గా ఉన్న విజువల్స్.. అఖిల్-పూజా(akhil and pooja) హెగ్డే కెమిస్ట్రీ సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి. అక్టోబరు 8న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు.

*గణేశ్ బెల్లంకొండ, వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న కొత్త సినిమాకు సంబంధించిన టైటిల్​, ఫస్ట్​లుక్ మంగళవారం ఉదయం 10:46 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. లక్ష్మణ్ రామకృష్ణ దర్శకుడు. సితార ఎంటర్​టైన్​మెంట్స్ నిర్మిస్తోంది.

.

*'పెళ్లి సందD' టీజర్(pelli sandadi new movie)​.. మంగళవారం సాయంత్రం 4 గంటలకు రానుంది. కింగ్ నాగార్జున రిలీజ్ చేయనున్నారు. రోషన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా ఈ సినిమాలో నటించారు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు.. ఈ చిత్రంతోనే నటుడిగా పరిచయమవుతున్నారు. గౌరి రోనంకి దర్శకురాలు.

..

*'ది టష్కెంట్ ఫైల్స్' సినిమాకు కొనసాగింపుగా 'ది దిల్లీ ఫైల్స్' చిత్రాన్ని తీస్తున్నారు. ఆదివారం ఈ విషయాన్ని ప్రకటించారు. వివేక్ రంజన్ అగ్రిహోత్రి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు హీరో సాయిరామ్ శంకర్ పుట్టినరోజు సందర్భంగా అతడు హీరోగా నటిస్తున్న 'రీసౌండ్' మోషన్​ పోస్టర్​ రిలీజ్ చేశారు.

.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details