తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Cinema news: 'రిపబ్లిక్', 'పెళ్లి సందD', 'పరిణయం' ట్రైలర్ల సందడి - dulqar salman new movie

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో 'రిపబ్లిక్', 'పెళ్లి సందD', 'పరిణయం' ట్రైలర్లు ఇందులో ఉన్నాయి.

latest telugu movie trailers
మూవీ న్యూస్

By

Published : Sep 22, 2021, 11:12 AM IST

*సాయిధరమ్ తేజ్ ఐఏఎస్ అధికారిగా నటించిన చిత్రం 'రిపబ్లిక్'(sai tej republic movie). అక్టోబరు 1న థియేటర్లలోకి రాబోయే ఈ సినిమా ట్రైలర్​ను.. మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi movies) బుధవారం(సెప్టెంబరు 22) విడుదల చేశారు. ఆద్యంతం ఆకట్టుకుంటూ అంచనాల్ని పెంచుతోంది. ఇందులో రమ్యకృష్ణ రాజకీయ నాయకురాలిగా నటిస్తుండగా, జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్​. దేవాకట్టా దర్శకుడు.

*సూపర్​స్టార్ మహేశ్​బాబు(mahesh babu movies) చేతుల మీదుగా 'పెళ్లి సందD' ట్రైలర్​ను(pelli sandadi 2) రిలీజ్ చేశారు. ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో రోషన్, శ్రీలీల హీరోహీరోయిన్లు. స్టార్ డైరెక్టర్ రాఘవేంద్రరావు.. ఈ సినిమాతోనే నటుడిగా పరిచయమవుతున్నారు. గౌరీ రోనంకి ఈ చిత్రానికి దర్శకురాలు. దసరాకి థియేటర్లలోకి రానుందీ సినిమా.

*దుల్కర్​ సల్మాన్ మరోసినిమా తెలుగు ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమైంది. 'పరిణయం' పేరుతో డబ్ అవుతున్న ఈ చిత్ర ట్రైలర్​ బుధవారం రిలీజైంది. సెప్టెంబరు 24న ఆహా ఓటీటీలో విడుదల కానుంది. మలయాళ మూవీ 'వరణే అవశ్యముండ్'కు తెలుగు వెర్షన్ ఇది. దుల్కర్ సరసన కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్​గా చేసింది. సురేశ్ గోపీ, శోభన కీలక పాత్రలు పోషించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details