*పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ 'భీమ్లానాయక్'టైటిల్ సాంగ్ రికార్డు సృష్టించింది. అత్యంత వేగంగా 1 మిలియన్ లైకులు అందుకున్న తెలుగు పాటగా నిలిచింది. కేవలం మూడు రోజుల్లో ఈ మార్క్‌ను అందుకోవడం విశేషం. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమా థియేటర్లలోకి రానుంది.
*సంతోష్ శోభన్, టీనా, విష్ణుప్రియ ప్రధానపాత్రల్లో నటించిన 'ద బేకర్ అండ్ ద బ్యూటీ' వెబ్ సిరీస్ ట్రైలర్ వచ్చేసింది. ఆహా ఓటీటీలో సెప్టెంబరు 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ట్రైయాంగిల్ లవ్‌స్టోరీతో ఈ సిరీస్‌ను తీసినట్లు తెలుస్తోంది.