బాలీవుడ్ నటి కాజోల్ ఓ పుస్తకం చదువుతోన్న ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా 'ఈ పదమంటే నాకెంతో ఇష్టం' అంటూ ఇంగ్లీష్‌లోనే పొడవైన పదాన్ని (supercalifrangilisticexpialodocious) పోస్ట్ చేసింది. అయితే 'ఈ పదం నేను చదువుతోన్న బుక్‌లో లేదు' అని చెప్పుకొచ్చింది.
ఈ పదం గురించి శోధించగా ఇది అర్థరహిత పదం అని తెలిసింది. అయితే అమితంగా ప్రశంసించాల్సిన సందర్భాలలో ‘అద్భుతం, చాలా బాగుంది’ మొదలైన వాటికి సమానార్థకంగా దీనిని ఉపయోగిస్తారని తెలిసింది. ఎక్కువగా పిల్లలే ఈ పొడవైన పదాన్ని వాడడం గమనార్హం.
తెలుగు భామ తేజస్వీ మదివాడ ‘జీవితం’ అంటూ ఓ జలపాతం దగ్గర ధ్యానం చేస్తోన్నట్టుగా దిగిన అందమైన ఫొటోని పోస్ట్ చేసింది.
అందాల తార రమ్యక్రిష్ణ దర్శకురాలు నందినీ రెడ్డితో సరదాగా దిగిన ఓ ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.
అందాల తార మోనాలిసా తన తాజా ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ‘నా అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయి.. కాబట్టి నా ప్రవర్తన కూడా భిన్నంగానే ఉంటుంది’ అని రాసుకొచ్చింది.