మెగాహీరో సాయితేజ్ నటిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ 'రిపబ్లిక్'(sai tej republic movie). ఈ సినిమా ట్రైలర్‌ను(republic trailer) సెప్టెంబర్ 22, ఉదయం 10గంటలకు మెగాస్టార్ చిరంజీవి విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో పంజా అభిరామ్ అనే ఐఏఎస్ అధికారిగా సాయి కనిపించనున్నారు. ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్. దేవకట్టా దర్శకుడు. అక్టోబరు 1న థియేటర్లలో విడుదల కానుందీ చిత్రం.
శ్యామ్ సింగరాయ్
హీరోయిన కృతిశెట్టి నటిస్తున్న సినిమాల్లో 'శ్యామ్ సింగరాయ్'(nani shyam singha roy)ఒకటి. నేడు(సెప్టెంబరు 21) ఈ ముద్దుగుమ్మ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా నాని, సాయిపల్లవి(nani sai pallavi new movie) నటిస్తున్నారు. రాహుల్ సంకిృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు.
'కార్తికేయ' లుక్స్
హీరో కార్తికేయ ప్రస్తుతం 'వాలిమై'(valimai ajith movie), 'రాజావిక్రమార్క'(raja vikramarka kartikeya) సినిమాల్లో నటిస్తున్నారు. నేడు(సెప్టెంబరు 21) ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇరు చిత్రబృందాలు కార్తికేయకు శుభాకాంక్షలు తెలిపాయి. ఆయనకు సంబంధించిన కొత్త లుక్స్‌ను విడుదల చేశాయి.