తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'కరణ్​, షారుక్.. నా భర్తకు మాయమాటలు చెప్పారు' - sushanth death news latest

బాలీవుడ్​ పరిశ్రమలో బంధుప్రీతికి తన భర్త కూడా బలైనట్లు దివంగత నటుడు ఇందర్​ కుమార్​ భార్య పల్లవి ఆరోపించారు. షారుక్​ ఖాన్​, కరణ్ జోహార్​ లాంటి సినీ ప్రముఖులు ఇందర్​కు అవకాశాలు ఇస్తామని మాయమాటలు చెప్పినట్లు పేర్కొన్నారు.

Late Inder Kumar's wife accuses Karan Johar, SRK of giving false hope
'కరణ్​, షారుఖ్​లు నా భర్తకు మాయమాటలు చెప్పారు'

By

Published : Jun 25, 2020, 5:54 AM IST

Updated : Jun 25, 2020, 6:04 AM IST

సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ ఆత్యహత్యతో బాలీవుడ్​లో బంధుప్రీతి, పక్షపాతం రాజ్యమేలుతోదంటూ సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా దివంగత నటుడు ఇందర్​ కుమార్​ భార్య పల్లవి.. తన భర్త ఇండస్ట్రీలో నెపోటిజం బాధితుడిగా పేర్కొన్నారు. షారుక్​ ఖాన్​, కరణ్​ జోహార్​ లాంటి సినీ ప్రముఖులు ఇందర్​ కెరీర్​పై తీవ్ర ప్రభావం చూపించారంటూ విమర్శించారు. తన భర్త చనిపోవడానికి ముందు సినిమా అవకాశాల కోసం ఎంతో శ్రమించాడని ఇన్​స్టా​ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.

పల్లవి

''నా భర్త చనిపోయే ముందు ఇద్దరు సినీ ప్రముఖుల సాయం కోరినట్లు నాకు గుర్తుంది. అప్పటికే ఆయన చిన్న ప్రాజెక్టులు చేస్తున్నారు. కానీ మునపటిలా పెద్ద సినిమాలు చేయాలనుకున్నారు. ఆయన కరణ్​ జోహార్​ దగ్గరకు వెళ్లినప్పుడు నేనూ అక్కడే ఉన్నా. సుమారు 2 గంటల పాటు బయటే నిలబెట్టారు. ఆ తర్వాత అతడి మేనేజర్​ వచ్చి కరణ్​ పనిలో ఉన్నారని చెప్పాడు. కానీ అతను బయటికి వచ్చే వరకు ఎదురు చూశాం. కరణ్​ వచ్చి ఇప్పుడేం అవకాశాలు లేవని అన్నారు. అయినా అతని వెంట నా భర్త 15 ఏళ్లు తిరుగుతూనే ఉన్నాడు. కానీ ఎలాంటి అవకాశాలు లేవనే వాడు''

- పల్లవి, ఇందర్​ భార్య

షారుక్​ కూడా చివరివరకు తిప్పించుకొని అవకాశాలు లేవని అనేవాడని పల్లవి తెలిపారు. ప్రతిభావంతులకు సాయం చేసేందుకు కష్టమెందుకని.. భయపడాల్సిన అవసరం ఎందుకని బాలీవుడ్​ ప్రముఖులపై ప్రశ్నలు గుప్పించారు. ఇప్పటికైనా ఇండస్ట్రీలో నెపోటిజం ఆగిపోవాలని అన్నారు. ఆ విధమైన చర్యలు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

పల్లవి​

ఇదీ చూడండి:బాలీవుడ్ నటులకు సోషల్​ మీడియా సెగ​

Last Updated : Jun 25, 2020, 6:04 AM IST

ABOUT THE AUTHOR

...view details