ఇటీవల అకాల మరణం చెందిన కన్నడ నటుడు చిరు సర్జా సతీమణి మేఘన.. గురువారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఇన్‌స్టా వేదికగా ధ్రువ్ సర్జా ఈ శుభవార్త తెలియజేశారు. కుటుంబసభ్యులతో కలిసి ఆస్పత్రి వద్దే ఉన్న ధ్రువ్.. తన అన్న కుమారుడ్ని అపురూపంగా చేతిలోకి తీసుకుని మురిసిపోయారు. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. సర్జా కుటుంబానికి శుభాకాంక్షలు తెలుపుతూ నెటిజన్లు వరుస ట్వీట్లు చేస్తున్నారు.
జూనియర్ వచ్చేశాడు.. చిరు సర్జా ఇంట్లో ఆనందం - chiranjeevi news
చిరు సర్జా సతీమణి మేఘన.. పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో సర్జా కుటుంబానికి శుభాకాంక్షలు చెబుతూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.
చిరు సర్జా కొడుకు
సర్జా కుటుంబానికి అక్టోబర్ నెల ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే, ఈ నెలలోనే చిరు, ధ్రువ్ జన్మించారు. ఇప్పుడు జూనియర్ చిరు కూడా జన్మించడం వల్ల కుటుంబసభ్యులు ఎంతో సంతోషిస్తున్నారు. మూడేళ్ల క్రితం ఇదే రోజున చిరు-మేఘనల నిశ్చితార్థం జరగడం విశేషం.