ప్రముఖ గాయనీమణి లతా మంగేష్కర్ అనారోగ్యంతో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని, కుటుంబ సభ్యులతో మాట్లాడతున్నారని సమాచారం. అయితే సామాజిక మాధ్యమాల్లో కొంతమంది పనిగట్టుకుని లత ఆరోగ్యంపై లేనిపోని ప్రచారాలు చేస్తున్నారు. లతా మంగేష్కర్ని అభిమానించే చాలామంది ఇలాంటి వార్తలు విని తీవ్ర ఆందోళనలకు గురౌతున్నారు.
"అలాంటి వార్తలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. ఆమె బాగానే ఉన్నారు. వైద్యుల సలహా మేరకు మాత్రమే లత హాస్పిటల్లో ఉంటున్నారు. బయటకు వెళ్తే చాలామంది వస్తూపోతూ ఉంటారు. వారందరిని కలవడం వల్ల ఆమె మరింత ఒత్తిడికి గురౌతుందనే ఉద్దేశంతోనే వైద్యశాలలో ఉంచాం."
-కుటుంబసభ్యులు