ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆమె ఐసీయూలో ఉన్నారని.. నెమ్మదిగా కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. అయితే లతా వ్యక్తిగత ప్రతినిధి బృందం మాత్రం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని ప్రకటించింది.
"లతా ఆరోగ్యం బాగానే ఉంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఆమె బలంగా పోరాడారు. ఒక గాయనిగా ఆమె ఊపిరితిత్తులకు ఉన్న సామర్థ్యమే ఆమెను గట్టెక్కించింది. నిజంగా గొప్ప యోధురాలు. ఆసుపత్రి నుంచి లతాజీ ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారో మేం తెలియజేస్తాం" -లతా మంగేష్కర్ పీఆర్ టీమ్