మెట్రో కార్‌షెడ్ ఏర్పాటులో భాగంగా ఆరే సబర్బన్ ప్రాంతంలో దాదాపు 2,700 చెట్లను నరికేందుకు ఆదేశాలిచ్చింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రముఖ గాయని లతా మంగేష్కర్. చెట్లను కాపాడాల్సిన బాధ్యతనుప్రభుత్వం విస్మరిస్తోందని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.
" 2,700 చెట్లను తొలగించి ప్రకృతిని నాశనం చేయాలని చూస్తున్నారా? దీని వల్ల వేలాది పక్షులు, జంతువుల జీవనం దెబ్బతింటుంది. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఈ విషయంపై ప్రభుత్వం మళ్లీ పునరాలోచన చేయాలి. అడవిని సంరక్షించాలి". -లతా మంగేష్కర్, గాయని
ఆరే కాలనీ నుంచి గోరేగాన్ ప్రాంతాన్ని కలుపుతూ మెట్రో కార్‌షెడ్ వేయాలనుకుంటున్నట్లు ప్రకటించింది బ్రిహన్ ముంబయి మున్సిపల్ కార్పోరేషన్ (బీఎమ్సీ). ఈ ప్రాంతం నగరానికి స్వచ్ఛమైన గాలిని అందించేందుకు ఉపయోగపడుతోందని, అందుకే చెట్లను కాపాడాలని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆరే అటవీ ప్రాంతాన్ని రక్షించాలని పర్యావరణ ప్రేమికులు ఇటీవల నిరసన చేపట్టారు. బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్వీరితో కలిసింది. బీఎమ్సీ నిర్ణయం హాస్యాస్పదమని అభివర్ణించింది. దియా మీర్జా, రవీనా టాండన్, రణ్‌దీప్ హుడా, ఇషా గుప్తా, కపిల్ శర్మ వంటి నటీనటులు ఈ నిర్ణయంపై అభ్యంతరం తెలిపారు.
ఇదీ చదవండి..అతిలోక సుందరే కదా..! నిజమా? భ్రాంతా?