తెలంగాణ

telangana

ETV Bharat / sitara

గాయని లతా మంగేష్కర్.. ఇంకా ఐసీయూలోనే! - లతా మంగేష్కర్

గాయని లతా మంగేష్కర్​.. ప్రస్తుతం ఐసీయూలోనే ఉన్నారని, నెమ్మదిగా కోలుకుంటున్నారని వైద్యులు చెప్పారు. అయితే ఆమె డిశ్చార్జ్​ గురించి ఎదురు చూస్తున్నట్లు లత సోదరి ఉషా తెలిపారు.

గాయని లతా మంగేష్కర్

By

Published : Nov 18, 2019, 7:04 PM IST

శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు ప్రముఖ గాయని లతా మంగేష్కర్​. ముంబయిలోని బ్రీచ్​ కాండీ ఆసుపత్రిలోని గత సోమవారం చేరారు. అయితే ఇప్పటికీ ఆమె.. ఐసీయూలోనే ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

"ఆమె(లతా మంగేష్కర్) కోలుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఐసీయూలోనే ఉన్నారు" ఆసుపత్రిలోని ఓ వైద్యుడు

ఈ విషయం గురించి లత సోదరి ఉషా మంగేష్కర్ మాట్లాడారు. ఆమె కోలుకుంటున్నారని, వైద్యులు ఎప్పుడు డిశ్చార్జ్​ చేస్తారనే దాని గురించి ఎదురు చూస్తున్నామని చెప్పారు.

గాయని లతా మంగేష్కర్

లతా మంగేష్కర్.. తన ఏడు దశాబ్దాల కెరీర్​లో 30 వేలకు పైగా పాటలు పాడారు. శ్రోతల్ని అలరించారు. భారతీయ సినీ చరిత్ర అత్యుత్తమ నేపథ్య గాయనిగా పేరు తెచ్చుకున్నారు. భారత ప్రభుత్వం.. ఆమెను 2001లో భారతరత్నతో గౌరవించింది.

ఇది చదవండి: గాయని లతా మంగేష్కర్​ ఆరోగ్యం.. కాస్త విషమంగానే!

ABOUT THE AUTHOR

...view details