తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కోలుకుంటున్న లతా మంగేష్కర్​ - Lata Mangeshkar

బాలీవుడ్ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్యం కుదుటపడినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అయితే పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుందని సమాచారం.

లతా మంగేష్కర్

By

Published : Nov 14, 2019, 11:03 AM IST

అనారోగ్యంతో ముంబయిలో ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ దిగ్గజ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్యం కుదుట పడింది. అయితే పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

లత నిమోనియో, ఛాతి ఇన్​ఫెక్షన్​తో బాధపడుతున్నారు.శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడిన ఆమె... సోమవారం తెల్లవారుజామున ఆసుపత్రిలో చేరారు.

వివిధ భాషల్లో 30వేల పైచిలుకు పాటలను ఆలపించిన సంగీత దిగ్గజాన్ని 2001లో భారత రత్నతో గౌరవించింది ప్రభుత్వం. లతా మంగేష్కర్ చివరగా 2004లో వచ్చిన బాలీవుడ్ చిత్ర వీర్ జారా సినిమాలో ఫుల్​ ఆల్బమ్ పాడారు.

ఇదీ చదవండి: తమిళ తంబిలను పలకరించనున్న ఆత్రేయ..!

ABOUT THE AUTHOR

...view details