తెలంగాణ

telangana

ETV Bharat / sitara

28 రోజుల తర్వాత ఇంటికొచ్చిన లతా మంగేష్కర్

గత నెల 11న ఆసుపత్రిలో చేరిన గాయని లతా మంగేష్కర్.. 28 రోజుల తర్వాత డిశ్చార్చ్ అయ్యారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. తన కోసం ఆలోచించిన శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు చెప్పారు.

28 రోజుల తర్వాత ఇంటికొచ్చిన లతా మంగేష్కర్
దిగ్గజ గాయని లతా మంగేష్కర్

By

Published : Dec 8, 2019, 8:02 PM IST

శ్వాస సంబంధిత సమస్యలతో గత నెలలో ఆసుపత్రిలో చేరిన దిగ్గజ గాయని లతా మంగేష్కర్​.. 28 రోజుల తర్వాత డిశ్చార్చ్​ అయ్యారు. ఆదివారం సాయంత్రంఇంటికి చేరుకున్నారు. తన ఆరోగ్యం గురించి ఆలోచించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు. ఇన్​స్టా వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు.

"శ్వాస సమస్యల కారణంగా గత 28 రోజులుగా బ్రీచ్​ క్యాండీ ఆసుపత్రిలో ఉన్నా. పూర్తి ఆరోగ్యం పొందిన తర్వాతే డిశ్చార్చ్​ అవ్వమని డాక్టర్లు చెప్పారు. అందుకే ఇన్ని రోజులు ఉండాల్సి వచ్చింది. అందరి ఆశీర్వాదాలతో ఈ రోజు ఇంటికొచ్చా. వారందరికీ ధన్యవాదాలు. నన్ను చాలా చక్కగా చూసుకున్న డాకర్లకు కృతజ్ఞతలు" -లతా మంగేష్కర్, గాయని

పలు భారతీయ భాషల్లో లతా మంగేష్కర్​ వేల సంఖ్యలో పాటలు పాడారు. 2001లో కేంద్ర ప్రభుత్వం ఆమెను భారతరత్నతో సత్కరించింది.

ఇది చదవండి: మహీ... రిటైర్మెంట్ ఆలోచన రానీయొద్దు: లతా మంగేష్కర్

ABOUT THE AUTHOR

...view details