Lata Mangeshkar: దిగ్గజ గాయని లతా మంగేష్కర్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సినీప్రముఖులు. ఆమె మరణం తీవ్రంగా కలచివేసిందని చెప్పారు సూపర్‌స్టార్ మహేశ్ బాబు. ఆమె గానం ఎప్పటికీ బతికే ఉంటుందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.
నైటింగేల్ ఆఫ్ ఇండియా, దిగ్గజాల్లో ఒకరు.. లతా మంగేష్కర్ ఇకలేరు. ఆమె మహోన్నతమైన జీవితాన్ని గడిపారు. ఆమె గానం ఎప్పటికీ బతికే ఉంటుంది. సంగీతం ఉన్నంతవరకు ఆమెను గుర్తుచేసుకుంటారు.
- చిరంజీవి, నటుడు
భారతీయ సంగీతానికి నిర్వచనం..
"లతా మంగేష్కర్ మరణం కలచివేసింది. భారతీయ సంగీతానికి నిర్వచణం లతాజీ. ఆమె వారసత్వం అసమానమైనది. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. మీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు."
- మహేశ్ బాబు, నటుడు
ఆమె పాడటం నా అదృష్టం..