తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Lata Mangeshkar: కొవిడ్‌ నుంచి కోలుకున్న లతా మంగేష్కర్‌ - lata mangeshkar latest news

Lata Mangeshkar: ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే వెల్లడించారు.

Lata Mangeshkar
లతా మంగేష్కర్‌

By

Published : Jan 30, 2022, 11:00 PM IST

Lata Mangeshkar: ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ కొవిడ్‌, న్యుమోనియా నుంచి కోలుకున్నారని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే తెలిపారు. ఆమెకు చికిత్స అందిస్తున్న డాక్టర్‌ ప్రతీత్‌ సమదానితో మాట్లాడానని, ప్రస్తుతం లతా ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు.

"లతా మంగేష్కర్‌ కొన్ని రోజులు వెంటిలేటర్‌పై ఉన్నారు. ఇప్పుడు ఆ అవసరం లేదు. ఆమెకు ఆక్సిజన్‌ మాత్రమే అందిస్తున్నారు. లతా మంగేష్కర్‌ చికిత్సకు స్పందిస్తున్నారు" అని తోపే తెలిపారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్ జనవరి 11న కొవిడ్‌ స్వల్ప లక్షణాలతో బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చేరారు.

ABOUT THE AUTHOR

...view details