తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సూర్య సినిమా విడుదల మరింత ఆలస్యం - హీరో సూర్య వార్తలు

'ఆకాశం నీ హద్దురా' సినిమాకు ఆటంకం ఏర్పడింది. దీంతో కొద్దిరోజులు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Suriya's Aakasam Nee Haddura
సూర్య

By

Published : Oct 22, 2020, 10:19 PM IST

Updated : Oct 22, 2020, 11:31 PM IST

అక్టోబరు 30న ఓటీటీలో రావాల్సిన సూర్య 'ఆకాశం నీ హద్దురా!' సినిమా.. మరింత ఆలస్యంగా విడుదల కానుంది. ఈ విషయాన్ని హీరోనే స్వయంగా వెల్లడించారు. భారత వాయుదళం, నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం(ఎన్​ఓసీ) ఇచ్చే విషయమై జాప్యం జరుగుతోందని, అందుకే కొన్నిరోజుల తర్వాత రిలీజ్​ చేస్తామని సూర్య తెలిపారు.

'ఆకాశం నీ హద్దురా' సినిమా విడుదలపై సూర్య ప్రకటన

ఎయిర్ డెక్కన్ చీఫ్ జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తీశారు. ఇందులో సూర్య సరసన అపర్ణ బాలమురళి హీరోయిన్​గా నటించింది. కలెక్షన్ కింగ్ మోహన్​బాబు కీలకపాత్ర పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించగా, 'గురు' ఫేమ్ సుధా కొంగర దర్శకత్వం వహించారు.

Last Updated : Oct 22, 2020, 11:31 PM IST

ABOUT THE AUTHOR

...view details