ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాకు వచ్చారు. లాల్ సింగ్ చద్దా షూటింగ్ నిమిత్తం.. రెండు రోజుల పాటు జిల్లాలో చిత్రబృందం ఆయనపై పలు సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. శుక్రవారం అమలాపురంలో, శనివారం కాకినాడ బీచ్‌లో చిత్రీకరణ జరగనుంది. షూటింగ్‌కు అనువుగా ఆమిర్ ఖాన్ కాకినాడలోని ఓ హోటల్లో బస చేస్తున్నారు.
కొవిడ్ నేపథ్యంలో ఆమిర్‌ను కలిసేందుకు ఎవరినీ అనుమతించలేదు. ఆయన బస చేసిన హోటల్‌కు ప్రైవేట్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో రక్షణ కల్పించారు.
1994లో విడుదలైన 'ఫారెస్ట్ గంప్' హాలీవుడ్ సినిమాకు హిందీ రీమేక్ ఇది. ఇందులో ఆమిర్‌ఖాన్ సరసన కరీనా కపూర్ నాయికగా నటిస్తోంది. అక్కినేని వారసుడు నాగచైతన్య ఈ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టనున్నాడు. విజయ్ సేతుపతి ఈ ప్రాజెక్టును వదులుకున్న తర్వాత ఆ పాత్రలో అక్కినేని నాగ చైతన్యను చిత్రబృందం ఎంపిక చేసింది. ఈ చిత్రానికి అద్వైత్ చందన్ దర్శకత్వాన్ని వహిస్తున్నారు. క్రిస్మస్కు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం ఇదివరకే ప్రకటించింది.
ఇదీ చదవండి:ఆమిర్‌తో చైతూ.. 'మహాసముద్రం' సాంగ్ అప్డేట్
ఆమిర్‌తో చైతూ టీటీ.. వరుస అప్డేట్స్తో 'లక్ష్య'