వైవిధ్య నటనకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే కథానాయకుడు 'ఆమిర్ ఖాన్'. తాజాగా అతడు నటిస్తోన్న చిత్రం 'లాల్ సింగ్ చద్దా'. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. అందులో కరీనా కపూర్ హీరోను హృదయ పూర్వకంగా హత్తుకున్నట్లు ఉంది. ఆమె ధరించిన దుస్తులు, మేకప్‌తో దేశీ అమ్మాయి లుక్‌లో కనిపించింది. ఇదే ఫొటోను ఆమిర్‌ఖాన్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఆ ఫొటోకి 'హ్యాపీ వాలెంటెన్స్ డే కరీనా'.. అంటూ ట్యాగ్‌లైన్ తగిలించాడు.
"కరీనా... వీలుంటే ప్రతీ సినిమాలో నీతోనే రొమాన్స్ చేయాలనుంది. నీతో యాక్ట్ చేస్తుంటే రొమాన్స్ చాలా సులువుగా వస్తుంది.’’