ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ఖరారు చేశారు. ఎన్నికల నేపథ్యంలో మూవీ రిలీజ్ ఆలస్యం అవుతుందని అంతా భావించారు. కానీ మార్చి 29నే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ట్విట్టర్లో ప్రకటించారు వర్మ.
అనుమానాలకు తెరదించిన వర్మ
ఎన్నికల ముందు ఎంతో ఆసక్తికరంగా మారిన లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల అంశం ఒడుదొడులకు దాటుకుని ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
లక్ష్మీస్ ఎన్టీఆర్
అయితే ఈ చిత్రంపై సెన్సార్ బోర్డ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. మరి వర్మ ఫిక్స్ చేసిన కొత్త డేట్‌కి అయినా చిత్రం విడుదలవుతుందా లేదా అనేది చూడాలి.
Last Updated : Mar 19, 2019, 8:47 PM IST