తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నయన్​కు 'లక్ష్మీ' అవకాశం అలా వచ్చింది! - LATEST CINEMA NEWS

వెంకటేశ్ హీరోగా వి.వి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'లక్ష్మీ'. ఈ సినిమాలో వెంకీ, నయన్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. అయితే ముందుగా నయన్ స్థానంలో మరో హీరోయిన్​ను అనుకుందట చిత్రబృందం.

'Lakshmi' opportunity for Nayan to do so!
నయన్​కు 'లక్ష్మీ' అవకాశం అలా వచ్చింది!

By

Published : Mar 25, 2020, 6:45 AM IST

'లక్ష్మీ బావ.. లక్ష్మీబావ నిన్నే పెళ్లాడతా.. లక్ష్మీబావ లక్ష్మీబావ నీకే పెళ్లానైపోతా' అంటూ నయనతార ఎంతగా అలరించిందో చెప్పనవసరం లేదు. లక్ష్మీబావ ఎవరో కాదు వెంకటేశ్‌. ఇతడు హీరోగా వి.వి.వినాయక్‌ తెరకెక్కించిన 'లక్ష్మీ' చిత్రంలోని గీతమిది. నయన్‌తోపాటు ఛార్మి.. వెంకీతో ఆడిపాడింది. ఈ చిత్రంలో వెంకీ, నయన్‌ల కెమిస్ట్రీ ఓ రేంజ్‌లో ఆకట్టుకుంది.

అయితే నయన్‌ స్థానంలో ఆర్తి అగర్వాల్‌ ఉంటే ఎలా ఉండేదో ఊహించుకోండి. ఎందుకంటారా? ముందుగా ఈ కథలో నటించేందుకు ఆర్తి అగర్వాల్‌ను సంప్రదించిందట చిత్రబృందం. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఈ చిత్రంలో నటించలేనని ఆర్తి చెప్పినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. దాంతో ఆమె స్థానంలో నయనతారను ఎంపిక చేశారు. అలా ఆర్తికి కుదరకపోవడం వల్ల నయన్‌ 'లక్ష్మీ'బావతో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

ABOUT THE AUTHOR

...view details