తెలంగాణ

telangana

ETV Bharat / sitara

టీజర్​: రీల్​ స్టార్​ రియల్​ లైఫ్​ 'లేడీ​' - మాధవి లత లేడీ టీజర్​

మాధవీ లత నటించిన 'లేడీ' సినిమా టీజర్​ విడుదలైంది. రీల్​ స్టార్​ రియల్​ లైఫ్​ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

lady
లేడీ

By

Published : Sep 5, 2020, 6:35 PM IST

మాధవీ లత ప్రధాన పాత్రలో ఓ నటి నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తోన్న చిత్రం 'లేడీ'. శనివారం సినిమాకు సంబంధించిన టీజర్​ విడుదలైంది. ఇందులో మాధవి ఒత్తిడిని ఎదుర్కొంటూ.. మత్తుకు బానిసగా మారిన ఓ నటి పాత్రలో కనిపించింది. టీజర్​ ఆసక్తికరంగా సాగింది. ఈ సందర్భంగా దర్శకుడు జీఎస్‌ఎస్‌పీ కల్యాణ్‌ మాట్లాడుతూ.. ఓ రీల్‌ స్టార్‌తో రియల్ లైఫ్ థ్రిల్లింగ్ ఎమోషనల్ డ్రామా‍గా చిత్రాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు.

"థ్రిల్లింగ్​ ఎపిసోడ్స్​తో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరకెక్కిస్తున్నాం. సినిమాకు కథానాయిక మాధవీ లత నటనే హైలెట్‌గా నిలవనుంది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని భారీ స్థాయిలో విడుదల చేయనున్నాం."

-జీఎస్‌ఎస్‌పీ కల్యాణ్​, సినీ దర్శకుడు

ఈ సినిమాను చరణ్ క్రియేషన్స్, జీఎస్‌ఎస్‌పీ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్వరలోనే ట్రైలర్​ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details