తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆచార్య': 'లాహే లాహే' సాంగ్​ ఆగయా..! - చిరంజీవి ఆచార్య

మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఆచార్య'. మే 13న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇందులోని 'లాహే లాహే' లిరికల్​ వీడియోను చిత్రబృందం బుధవారం విడుదల చేసింది. ఈ పాటలో చిరు వేసే హుషారైన స్టెప్పులు అభిమానులను అలరిస్తున్నాయి.

laahe laahe song released from Megastar Chiranjeevi's Acharya
'ఆచార్య': 'లాహే లాహే' సాంగ్​ ఆగయా..!

By

Published : Mar 31, 2021, 4:07 PM IST

Updated : Mar 31, 2021, 4:22 PM IST

వెండితెరపై చిరు డ్యాన్స్‌ చేస్తుంటే చూడటానికి రెండు కళ్లూ చాలవు. రీఎంట్రీ 'ఖైదీ నంబర్‌ 150'లో అదిరిపోయే స్టెప్పులతో అలరించారు మెగాస్టార్​ చిరంజీవి. ఇప్పుడు మరోసారి తన మెగా మ్యాజిక్‌తో అభిమానులను అలరిస్తున్నారు. చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఆచార్య'. రామ్‌చరణ్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. మే 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇందులోని 'లాహే.. లాహే..' సాగే గీతాన్ని విడుదల చేశారు. ఇందులో నటి సంగీత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఈ పాటకు సంబంధించిన ప్రోమోను మంగళవారమే విడుదల చేసింది చిత్రబృందం. కేవలం 14 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో ఒక్క స్టెప్‌తోనే చిరు మెస్మరైజ్‌ చేసేశారు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇదీ చూడండి:'ఆచార్య' సాంగ్​ ప్రోమో.. నితిన్​ 'మాస్ట్రో' గ్లింప్స్​

Last Updated : Mar 31, 2021, 4:22 PM IST

ABOUT THE AUTHOR

...view details