Kurup OTT: దుల్కర్ సల్మాన్ 'కురుప్' సినిమా ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో బుధవారం నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.
గ్యాంగ్‌స్టర్ సుకుమార కురుప్ బయోపిక్ ఈ సినిమా. దుల్కర్ సరసన శోభిత దూళిపాళ్ల హీరోయిన్గా నటించింది. శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వం వహించారు. ఇందులో దుల్కర్ డిఫరెంట్ లుక్స్ అభిమానుల్ని తెగ ఆకట్టుకున్నాయి.
Sushant singh rajput chhichhore: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 'చిచోరే'(2019) సినిమా చైనాలో విడుదలకు సిద్ధమైంది. జనవరి 7న దాదాపు 11 వేల థియేటర్లలో రిలీజ్ కానుందని చిత్రబృందం వెల్లడించింది.
కాలేజీ నేపథ్యంగా తీసిన ఈ సినిమా మన ప్రేక్షకుల్ని విశేషంగా అలరించింది. ఇందులో తెలుగు నటుడు నవీన్ పోలిశెట్టి కూడా కీలకపాత్రలో కనిపించి మెప్పించడం విశేషం. నితీష్ తివారీ దర్శకత్వం వహించారు.
Brahmastra release date: మూడు భాగాలుగా తెరకెక్కుతున్న 'బ్రహ్మస్త్ర' రిలీజ్ తేదీని ప్రకటించారు. తొలి పార్ట్‌ను వచ్చే ఏడాది సెప్టెంబరు 9 థియేటర్లలో విడుదల చేస్తామని తెలిపారు. దీనితో పాటే మోషన్ పోస్టర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల్ని అలరించనుంది.
బ్రహ్మాస్త్ర షూటింగ్లో రణ్‌బీర్ కపూర్-ఆలియా భట్
ఇందులో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ప్రధాన పాత్రలు పోషించారు. అమితాబ్ బచ్చన్, నాగార్జున తదితరులు కీలకపాత్రలు పోషించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.
*లావణ్య త్రిపాఠి పుట్టినరోజు సందర్భంగా ఆమె కొత్త సినిమా పోస్టర్‌ను రిలీజ్ చేశారు. మోడ్రన్ డ్రస్‌లో మెషీన్ గన్ ఫైర్ చేస్తున్న ఆమె లుక్ కేక పుట్టిస్తుంది.
హ్యాపీ బర్త్‌డే మూవీలో లావణ్య త్రిపాఠి
ఈ సినిమాకు 'హ్యాపీ బర్త్‌డే' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 'మత్తు వదలరా' ఫేమ్ రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్నారు. క్లాప్ ఎంటర్టైన్మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇవీ చదవండి: