చేనేత, చేతి వృత్తిల్లో మరెన్నో ఆవిష్కరణలు రావాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇందుకోసం 'తమసోమ జ్యోతిర్గమయ' లాంటి చిత్రాలు ఎంతో దోహదపడతాయని సూచించారు.
చేనేత గొప్పతనాన్ని చాటిచెప్పే సినిమా ఇది: కేటీఆర్ - ktr news
చేనేత నేపథ్య కథతో తెరకెక్కిన 'తమసోమ జ్యోతిర్గమయ' ట్రైలర్ను తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. సినిమా ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు.

భూదాన్ పోచంపల్లికి చెందిన యువకుడు బడుగు విజయ్ కుమార్ దర్శకత్వంలో విమల్ క్రియేషన్స్ పతాకంపై తడక రమేష్ నిర్మించిన 'తమసోమ జ్యోతిర్గమయ' ట్రైలర్ను కేటీఆర్ బుధవారం లాంఛనంగా ఆవిష్కరించారు. ఆద్యంతం ప్రచార చిత్రాన్ని వీక్షించిన ఆయన.. చేనేతల కష్టాలు, కన్నీళ్లనే కాకుండా యువతరం ఆవైపుగా ఎలా ఎదగాలనే ఆకాంక్షను ఈ చిత్రం చాటిచెబుతుందన్నారు. ఈ సినిమా ఘన విజయం సాధించాలని చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.
ఆనంద్ రాజ్, శ్రావణిశెట్టి జంటగా నటించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్టోబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో దర్శక నిర్మాతలు, నటీనటులు తమ అనుభవాలను చెప్పారు. ప్రేక్షకులకు తమ ప్రయత్నం తప్పకుండా నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.