Pawan kalyan Ktr: పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్(Pawan kalyan)-రానా(Rana) కీలక పాత్రల్లో సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించిన చిత్రం 'భీమ్లా నాయక్'(Bheemla Nayak). అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రచార కార్యక్రమాలను చిత్ర బృందం ముమ్మరం చేసింది. ఫిబ్రవరి 21న ప్రీరిలీజ్ వేడుక నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్(KTR) హాజరుకానున్నారు. చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. ట్రైలర్‌ను ఈ నెల 21నే రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
తమ విన్నపాన్ని మన్నించి ప్రీరిలీజ్ వేడుకకు వస్తానని చెప్పిన మంత్రి కేటీఆర్‌కు నిర్మాత నాగవంశీ ట్విటర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రీరిలీజ్ వేడుకకు కేటీఆర్ హాజరవుతుండటం వల్ల 'భీమ్లా నాయక్' (Bheemla Nayak) ఈవెంట్ మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.