"సామజవరగమన.. నిను చూసి ఆగ గలనా.." పాటకు సంగీత అభిమానులు ఎంత దగ్గర అయ్యారంటే.. "సామజవరగమన.. నిను వినకుండా ఉండగలమా..!" అన్న మాదిరిగా దగ్గరయ్యారు. ఎక్కడ చూసినా ఇదే పాట మారుమోగుతోంది. ప్రతి ఒక్కరికీ మత్తులా ఎక్కేసిన ఈ పాటకు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఫిదా అయ్యారు. ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్న ఆయన తనను మైమరపింపజేసిన సామజవరగమన.. పాటను ప్రశంసిస్తూ మంగళవారం ఉదయం ట్వీట్ చేశారు.
'సామజవరగమన..' పాటకు కేటీఆర్ ఫిదా - ETV Bharat sitara
'అల.. వైకుంఠపురములో' చిత్రంలోని ప్రతి పాట సరికొత్త రికార్డులను సాధిస్తూ.. ఎల్లలు లేని అభిమానాన్ని చూరగొంటోంది. ఇప్పుడు ఇందులోని 'సామజవరగమన' పాటకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఫిదా అయ్యారు.
'సామజవరగమన..' వినకుండా ఉండ గలమా..!
"విమానం కాస్త ఆలస్యమైంది. అప్పుడు స్విట్జర్లాండ్‌లో ఉదయం 3.30 అవుతోంది. ఆ సమయంలో 'సామజవరగమన' పాట విన్నాను. నాకు మంచి కంపెనీ ఇచ్చిందీ సాంగ్. ఎంతో అద్భుతంగా ఉన్న ఈ పాట వెంటనే నా ప్లేలిస్ట్‌లో చేరిపోయింది. తమన్.. ఈ సాంగ్‌తో మిమ్మల్ని మీరే మించిపోయారు" అని ట్వీట్ చేశారు.
ఇదీ చూడండి:- 'అసురన్' తెలుగు రీమేక్‌కు టైటిల్ ఖరారు!
Last Updated : Feb 17, 2020, 9:22 PM IST