నూతన దర్శకుడు అనిల్ పంగలూరి తెరకెక్కిస్తున్న వైవిధ్యభరిత చిత్రం 'క్షీరసాగర మథనం'. విబ్ జియార్ కాన్సెప్ట్‌తో నూతననటీలతో రూపొందుతోంది. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాకముందే చిత్ర యూనిట్ వినూత్న రీతిలో ప్రమోషన్స్ చేస్తుంది.
'క్షీరసాగర మథనం' విలన్‌ను పరిచయం చేసిన అడవి శేషు - ksheera sagara mathanam
విబ్జియార్ కాన్సెప్ట్‌తో టాలీవుడ్లో వస్తోన్న చిత్రం 'క్షీరసాగర మథనం'. తాజాగా ఈ సినిమాలోని విలన్ క్యారక్టర్ పోస్టర్‌ను యువ హీరో అడవి శేషు విడుదల చేశాడు.
!['క్షీరసాగర మథనం' విలన్‌ను పరిచయం చేసిన అడవి శేషు ksheera sagara mathanam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5221762-thumbnail-3x2-ksheera.jpg)
సినిమా
ఇప్పటికే ఈ సినిమా పేరును యువ కథానాయకుడు సందీప్ కిషన్ ఆవిష్కరించగా తాజాగా ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్న ప్రదీప్ రుద్ర పోస్టర్‌ను మరో యువ హీరో అడవి శేషు విడుదల చేశాడు. ప్రదీప్ ఈ చిత్రంలో బాబర్ ఆజమ్ పాత్రలో విలన్‌గా కనిపించనున్నాడు. ప్రస్తుతం శరవేగంగా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ సినిమా ఫ్రిబవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవీ చూడండి.. దీపికకు నేను సవతిని: అర్జున్ కపూర్