అనిల్ పంగులూరి దర్శకత్వం వహిస్తున్న 'క్షీరసాగర మథనం' సినిమా నుంచి మరో పాట విడుదలైంది. నా పేరు అంటూ సాగే ఈ గీతాన్ని, టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఇందులో మానస్, సంజయ్ కుమార్ హీరోలుగా నటిస్తున్నారు. అక్షత హీరోయిన్.
'క్షీరసాగర మథనం' పాట.. దర్శకుడు హరీశ్ శంకర్ ట్వీట్ - క్షీరసాగర మథనం సినిమా పాటలు
దర్శకుడు హరీశ్ శంకర్.. 'క్షీరసాగర మథనం' సినిమాలోని మరో పాటను ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
!['క్షీరసాగర మథనం' పాట.. దర్శకుడు హరీశ్ శంకర్ ట్వీట్ ksheera sagara madhanam movie Video song](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9212949-465-9212949-1602939033182.jpg)
'క్షీరసాగర మథనం' పాట
శ్రీ వెంకటేశ పిక్చర్స్‌తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ నిర్మిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయని, "క్షీరసాగర మథనం"ను ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారనే నమ్మకముందన్నారు దర్శకుడు అనిల్.