Kritishetty Bangarraju movie: తెలుగులో సినిమా అవకాశాలు పెరగడం వల్ల ముంబయి నుంచి తమ కుటుంబం పూర్తిగా హైదరాబాద్‌కు మకాం మార్చినట్లు 'ఉప్పెన' బ్యూటీ కృతిశెట్టి తెలిపింది. ప్రపంచస్థాయిలో ఎంతో గుర్తింపు పొందుతున్న తెలుగు సినీ పరిశ్రమలో కథానాయికగా నటించడం తనకెంతో గర్వంగా ఉందని చెప్పిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సంక్రాంతికి 'బంగార్రాజు' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యువ సర్పంచి నాగలక్ష్మి పాత్రలో ప్రేక్షకులను అలరించబోతుంది. ఈ సందర్భంగా 'బంగార్రాజు' చిత్రంలో తన పాత్ర తీరుతెన్నులు, నాగచైతన్య, నాగార్జునలతో పనిచేసిన అనుభవాన్ని తెలిపింది.
"బేబమ్మ కన్నా ఈ పాత్ర డిఫరెంట్‌గా ఉంటుంది. ఆత్మవిశ్వాసం ఉండే అమ్మాయి పాత్రలో కనిపిస్తా. నా రోల్‌ను చూసి అమ్మాయిలు కూడా స్ఫూర్తి పొంది, ఆత్మవిశ్వాసంతో ఉంటే సంతోషపడతాను. సంక్రాంతికి సినిమాను చూడటం తెలుగు ప్రేక్షకులకు ఎంతో ముఖ్యమో నాకు తెలుసు. ఇది పండగ కోసం తీసిన సినిమా. ఈ మూవీలో నటించడం హ్యాపీగా ఉంది. నాకు తెలుగు అంతగా రాదు. లాంగ్వేజ్ కష్టంగా అనిపించింది. డైలాగ్ పేపర్ ఇచ్చినప్పుడు పదాలను చూసి కష్టంగా అనిపించింది. కానీ టీమ్ హెల్ప్ చేసింది. 2020లో నాకు ఈ కథ చెప్పారు. అప్పటి నుంచి నా క్యారెక్టర్‌పై వర్క్ చేశాను. సెట్లో ఇంకా చాలా నేర్చుకున్నాను." అని చెప్పింది.
మీ పాత్ర గురించి చెప్పినప్పుడు స్పెషల్‌గా వర్క్ చేస్తారా?
నేనొక ఫైల్ సిద్ధం చేసుకుంటాను. నా క్యారెక్టర్ ఎలా ఉంటుందో చెప్పగానే పాయింట్స్ రాసుకుంటాను. ఇంటికి వెళ్ళగానే ఆ పాత్రకు అన్ని విషయాలను తెలుసుకుంటాను.
రూరల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న అమ్మాయిగా నటించడం ఎలా అనిపించింది?
'ఉప్పెన' టైమ్‌లో చాలా తెలుగు సినిమాలు చూశాను. గ్రామంలో అండే అమ్మాయిలు ఎలా ఉంటారో అప్పుడే తెలుసుకున్నాను.
నాగార్జున-నాగచైతన్యతో పని చేయడం ఎలా అనిపించింది?
నాగార్జున, చైతూతో పనిచేయడం చాలా ఈజీగా అనిపించింది. నన్ను జూనియర్లా కాకుండా టీమ్మేట్గా ట్రీట్ చేశారు. దీన్ని నేను గొప్పగా భావిస్తున్నాను.