తమిళ స్టార్ హీరో ధనుష్, తన అన్న దర్శకుడు సెల్వరాఘవన్ కాంబోలో తెరకెక్కనున్న కొత్త సినిమా 'నానేవరునేన్'. శనివారం(అక్టోబర్ 16) అన్ని పూజాకార్యక్రమాలతో లాంఛనంగా ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. ఫస్ట్‌లుక్ కూడా విడుదల చేశారు. ఇందులో ధనుష్ కౌబాయ్ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. రవిచంద్రన్ హీరోయిన్. గతంలో ధనుష్-సెల్వరాఘవన్ కాంబోలో 'తుల్లువదో ఇళమై', 'కాదల్ కొండేన్', 'పుదుపేట్టై', 'మయక్కం ఎన్న' చిత్రాలు విడుదలై హిట్ అయ్యాయి.
సీత పాత్ర పూర్తి
హీరో ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో 'ఆదిపురుష్' ఒకటి. ఇందులో ఆయన రాముడు పాత్ర పోషిస్తుండగా.. సీతగా కృతిసనన్ నటిస్తోంది. తాజాగా ఆమె పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తైనట్లు తెలిపింది చిత్రబృందం. కేక్ కట్ చేసి చిన్న పార్టీ చేసుకుంది. దానికి సంబంధించిన ఫోటోలను ట్వీట్ చేసింది చిత్రబృందం. ఈ మూవీకి ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నారు.
ట్రైలర్‌తో సునీల్
సునీల్, చాందిని రావు, దివ్య శ్రీపాద, శ్రీ విద్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'హెడ్స్ అండ్ టేల్స్'. 'కలర్ ఫొటో' ఫేమ్ సందీప్ రాజ్ కథ అందించారు. నటుడు సాయి కృష్ణ ఎన్రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ 'జీ 5'లో అక్టోబరు 22 నుంచి స్ట్రీమింగ్‌కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.