తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మహేశ్ హీరోయిన్​కు కరోనా పాజిటివ్! - prabhas adhipurush kriti sanon

తెలుగుతో పాటు హిందీలోనూ హీరోయిన్​గా గుర్తింపు తెచ్చుకున్న కృతి సనన్​కు కరోనా​ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే దీని గురించి ఇప్పటివరకు ఆమె ఎలాంటి ప్రకటన చేయలేదు.

Kriti Sanon tests positive for Covid-19: Reports
మహేశ్ హీరోయిన్​కు కరోనా పాజిటివ్!

By

Published : Dec 7, 2020, 7:20 PM IST

Updated : Dec 8, 2020, 7:11 AM IST

ప్రముఖ హీరోయిన్ కృతి సనన్​కు కొవిడ్ సోకినట్లు సమాచారం. ఇటీవలే చంఢీగడ్​లో షూటింగ్​ ముగించుకుని ముంబయికి చేరుకున్న ఈమె.. వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్​గా తేలిందట. అయితే ఈ విషయమై ఆమె ఎలాంటి పోస్ట్, ప్రకటన చేయలేదు.

'1-నేనొక్కడినే', 'దోచేయ్' లాంటి తెలుగు చిత్రాల్లో నటించిన కృతి.. ఆ తర్వాత బాలీవుడ్​లో బిజీ అయిపోయింది. ప్రస్తుతం పలు హిందీ చిత్రాల్లో నటిస్తోంది. ప్రభాస్ 'ఆదిపురుష్'లోనూ సీత పాత్ర కోసం ఈమెనే ఎంపిక చేసినట్లు బాగా ప్రచారమవుతుంది. ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.

హీరోయిన్ కృతి సనన్

ఈమె కంటే ముందు వరుణ్ ధావన్, నీతూ కపూర్, దర్శకుడు రాజ్​ మెహతాలకు కరోనా సోకింది. 'జుగ్ జుగ్ జియో' షూటింగ్ కోసం సిద్ధమవుతున్న వీరు.. పరీక్షలు చేయించుకోగా ఈ విషయం తెలిసింది. అయితే వీళ్లతో పాటే ఉన్న అనిల్ కపూర్, కియారా అడ్వాణీకి మాత్రం నెగెటివ్​గా తేలింది.

Last Updated : Dec 8, 2020, 7:11 AM IST

ABOUT THE AUTHOR

...view details