తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నన్ను వాళ్లు చులకనగా చూసేవారు' - నన్ను చులకనగా చూసేవారు

సినిమా అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు కొంతమంది తనను చులకనగా చూసేవారని తెలిపింది బాలీవుడ్​ హీరోయిన్​ కృతిసనన్​. తన సినీ జర్నీ గురించి పలు విషయాలను చెప్పుకొచ్చింది. ఆ విశేషాలపై ఓ లుక్కేద్దాం.

Kriti Sanon reveals her experiences battling harsh judgment at the hands of family members
'నన్ను వాళ్లు చులకనగా చూసేవారు'

By

Published : Apr 29, 2020, 7:10 AM IST

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా చిత్ర పరిశ్రమలో అవకాశాలు అందుకోవడం కష్టం. అమ్మాయిలకు ఈ రంగంలోకి రావాలంటే చాలా సవాళ్లు ఎదురవుతాయి. మహేష్‌బాబుతో 'నేనొక్కడినే'లో నటించిన కృతిసనన్‌ కూడా నాయిక కావడానికి చాలా కష్టాలు ఎదుర్కొన్నానని తెలిపింది.

"అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు మా బంధువులు కొందరు నన్ను చులకనగా చూసేవారు. చిత్ర పరిశ్రమ బురదగుంట లాంటిది. దాంట్లోకి దిగితే నీ జీవితం అంతే.. నీకు పెళ్లి కూడా కాదు అనేవారు. చాలా బాధ కలిగేది. కానీ ఏనాడూ భయపడలేదు. నా మనసు చెప్పినట్టు ముందుకు పోయా"

- కృతి, కథానాయిక.

భయపెట్టినోళ్లే పొగుడుతున్నారు

హీరోపంటి, బరేలీ కీ బర్ఫీ, లుకా చుప్పీ, హౌస్‌ఫుల్‌ 4 లాంటి చిత్రాలతో మంచి విజయాలు అందుకుంది కృతి. దిల్‌వాలే, కళంక్‌, పానిపట్‌ లాంటి భారీ చిత్రాల్లో నటించి సత్తా చాటింది.

"నా కెరీర్‌లో మంచి విజయాలు వచ్చాయి. గొప్ప నటులతో కలిసి పనిచేశాను. కెరీర్‌ తొలినాళ్లలో నన్ను భయపెట్టినవారే ఇప్పుడు నన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఆ మాటలు వింటుంటే గర్వంగా అనిపిస్తుంది. సినిమాల్లోకి వస్తానని అస్సలు అనుకోలేదు. కానీ అది జరిగింది. ఇంజినీరింగ్‌ను కెరీర్‌గా అనుకున్న నాకు నటిగా ఈ స్థాయి వస్తుందని ఊహించలేదు" అంటోంది కృతి.

ఇదీ చూడండి : హాట్​స్టార్​తో తేజ వెబ్​సిరీస్​.. అమెజాన్​తో సినిమా!

ABOUT THE AUTHOR

...view details