లాక్‌డౌన్(lockdown) సమయాన్ని ముంబయిలోని తన నివాసంలోనే ఆస్వాదిస్తోంది నటి కృతి సనన్(Kriti Sanon). అలా అని సరదాగా డ్యాన్సు చేస్తూనో, ఇష్టమైన సినిమాలు చూస్తుందనుకుంటే పొరపాటే. ఇటీవల ఆమె సంతకం చేసిన సినిమాల్లోని డైలాగ్స్‌ను ప్రాక్టీస్ చేస్తోందట కృతి. ప్రస్తుతం కృతి చేతిలో ఏడు ప్రాజెక్టులున్నాయి. వాటిల్లో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న 'ఆదిపురుష్'(Adipurush shooting) ఒకటి. ఇందులో శ్రీ రాముడిగా ప్రభాస్, సీతగా కృతి కనిపించనున్నారు. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నానని, డైలాగులు ప్రాక్టీస్ చేస్తున్నానని ఇటీవలే ఓ ఇంటర్వూలో తెలియజేసింది. మరో చిత్రం 'గణ్‌పత్'(Ganpath) కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చింది. ఈ క్లిష్ట సమయంలో మనమంతా ఒకటిగా నిలవాలని, మనకు సాయంగా నిలిచిన వారికి మనం సాయం చేయాలని అభిమానుల్ని కోరింది.