తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆ సమయమంతా వారితోనే గడుపుతా' - Kriti Sanon

ప్రస్తుతం 'మిమి' చిత్రంలో నటిస్తోంది బాలీవుడ్ నటి కృతి సనన్. ఈ సినిమా ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రెండో షెడ్యూల్ ప్రారంభంకానుంది. ఈ ఖాళీ సమయంలో ఏం చేస్తారన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పింది కృతి.

Kriti Sanon
కృతి

By

Published : Dec 21, 2019, 6:29 AM IST

ఈ ఏడాది క్షణం తీరిక లేకుండా విసుగు, విరామం లేకుండా పనిచేస్తుంది బాలీవుడ్‌ నటి కృతి ససన్‌. ప్రస్తుతం 'మిమి' అనే చిత్రంలో నటిస్తోంది. సినిమా ఇప్పటికే నలభై శాతం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఇక రెండో షెడ్యూల్‌ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించనున్నారని సమాచారం. ఈ విరామ సమయంలో ఏం చేస్తారని కొంతమంది మీడియా మిత్రులు అడగ్గా? అందుకు కృతి స్పందించింది.

"చాలా కాలంగా సినిమాల్లో బిజీగా ఉంటూ కుటుంబ సభ్యులతో సరైన సమాయాన్ని కేటాయించలేకపోయా. ప్రస్తుతం 'మిమి' షూటింగ్‌ సుమారు నలభై శాతం పూర్తయ్యింది. ఇక రెండో షెడ్యూల్‌ మొదలు పెట్టే వరకు కుటుంబ సభ్యులతో, నా స్నేహితులతో, ఇష్టమైన పనులు చేస్తూ సరదాగా గడుపుతా."
-కృతి సనన్, నటి

సరోగసి నేపథ్యంలో తెరకెక్కుతున్న 'మిమి' చిత్రానికి లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. మడోక్‌ ఫిలిమ్స్, జియో స్టూడియో సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి దినేష్‌ విజ్జన్‌ నిర్మాత. కృతి ససన్‌ కథానాయికగా నటించిన ఆరు సినిమాలు ఈ ఏడాదిలో తెరపైకి వచ్చి అలరించాయి. కృతి తెలుగులో '1: నేనొక్కడినే', 'దోచేయ్‌' చిత్రాల్లో నటించింది.

ఇవీ చూడండి.. చర్చనీయాంశంగా 'మేజర్‌' అప్‌డేట్‌

ABOUT THE AUTHOR

...view details