మంచి కథకు భాషా భేదాలు అడ్డుకాదు. అందుకే ఓ చిత్రం ఏ భాషలో హిట్టైనా.. దానిని తమ భాషలోకి రీమేక్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తాయి అన్ని చిత్ర పరిశ్రమలు. ఈ క్రమంలోనే తెలుగులో విజయం సాధించిన అనేక సినిమాలు బాలీవుడ్‌లో రీమేక్ అవుతున్నాయి.
'అల వైకుంఠపురములో' హిందీ రీమేక్‌లో కార్తిక్-కృతి! - హిందీ రీమేక్‌లో అల వైకుంఠపురములో
అల్లు అర్జున్ బ్లాక్‌బస్టర్ హిట్ 'అల వైకుంఠపురములో' హిందీ రీమేక్‌లో హీరో హీరోయిన్లుగా కార్తిక్ ఆర్యన్, కృతిసనన్ నటించనున్నట్లు తెలిసింది. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశముంది.
ఇప్పుడీ జాబితాలో అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో' సినిమా కూడా చేరిపోయినట్లు తెలిసింది. ఇందులో కథానాయకుడిగా కార్తిక్ ఆర్యన్‌ను, కథానాయికగా కృతి సనన్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశముంది. అంతకుముందు వీరిద్దరు కలిసి లుకా చుప్పీ సినిమాలో నటించారు. కాగా, ఆర్యన్ 'ధమాకా', 'భూల్ భులయ్య 2', 'దోస్తానా 2' సినిమాల్లో నటించగా.. కృతి సనన్ 'బచ్చన్ పాండే', 'మిమీ', 'భేడియా', 'ఆదిపురుష్' సినిమాల్లో నటిస్తోంది.
ఇదీ చూడండి: జాతీయ చలన చిత్ర అవార్డుల విజేతలు వీరే