హీరోయిన్ కృతిసనన్ మరో క్రేజీ ప్రాజెక్టులో చోటు దక్కించుకుంది. స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన రెండోసారి నటించే అవకాశం సొంతం చేసుకుంది. 'బచ్చన్ పాండే'లో హీరోయిన్గా ఎంపికైంది. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ నిర్మాత సాజిద్ నడియావాలా ట్వీట్ చేశారు.
నిర్మాత సాజిద్ నడియావాలా ట్వీట్ ఇటీవలే 'హౌస్‌ఫుల్-4'తో ప్రేక్షకుల ముందుకొచ్చిందీ జోడీ. ఇప్పుడీ చిత్రంతో మరోసారి అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
'బచ్చన్ పాండే'లోని అక్షయ్ ఫస్ట్‌లుక్‌ను జూలైలో విడుదల చేసింది చిత్రబృందం. సిల్క్ లుంగీలో ఉన్న అతడి లుక్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ఈ సినిమాకు ఫరాద్ సంజీ దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
బచ్చన్ పాండే సినిమాలో అక్షయ్ కుమార్ కృతిసనన్.. ఈ ఏడాది 'లుకాచుప్పీ', 'అర్జున్ పటియాలా', 'హౌస్‌ఫుల్-4' చిత్రాలతో అలరించింది. 'పానిపట్', 'మిమీ' సినిమాల్లో నటిస్తోంది.
ఇది చదవండి: సిల్క్ లుంగీతో అదిరే లుక్‌లో అక్షయ్