ఎనర్జిటిక్ స్టార్ రామ్ కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో నాయికగా 'ఉప్పెన' భామ కృతిశెట్టి నటిస్తుందంటూ ఇటీవలే ప్రచారం సాగింది. ఇదే విషయాన్ని తాజాగా వెల్లడించింది చిత్రబృందం. 'రాపో 19' వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ సినిమాలో కృతి శెట్టిని ఎంపిక చేసినట్టు సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేసింది.
రామ్ సరసన హీరోయిన్గా 'ఉప్పెన' బ్యూటీ
'ఉప్పెన' హిట్‌తో వరుస సినిమాలతో బిజీగా ఉన్న బ్యూటీ కృతిశెట్టికి మరో క్రేజీ ఆఫర్ వచ్చింది. హీరో రామ్-దర్శకుడు లింగుస్వామి కాంబోలో రూపొందుతోన్న చిత్రంలో కృతిని హీరోయిన్గా ఎంపిక చేసినట్లు ఆ చిత్రబృందం ప్రకటించింది.
రామ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన 'ఉప్పెన' బ్యూటీ
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూర్తి స్థాయి యాక్షన్ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. టైటిల్, సాంకేతిక బృంద వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న కృతి ప్రస్తుతం నాని సరసన 'శ్యామ్ సింగరాయ్', సుధీర్ బాబు సరసన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' చిత్రాల్లోనూ నటిస్తోంది.
ఇదీ చూడండి:రివ్యూ: రాజ్‌తరుణ్ 'పవర్‌ప్లే' ఎలా ఉందంటే?